– బోధన్ ఏసీపీ శ్రీనివాస్
రుద్రూర్, బతుకమ్మ : ప్రశాంతమైన వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలను జరుపుకోవాలని, క్రాకర్స్, డిజిలపై నిషేధం విధిస్తున్నట్లు బోధన్ ఏసిపి తెలిపారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో వర్ని ,రుద్రూర్, కోటగిరి మండలాల డీజే యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రశాంతమైన వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలను జరుపుకోవాలని, శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు. ఊరేగింపులు వేడుకల సందర్భంగా డీజేలతో విపరీత శబ్ద కాలుష్యానికి దారి తీస్తున్న డీజే లపై కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. డిజె సౌండ్ కారణంగా బహిరంగ ప్రదేశాలలో టపాకులు పేల్చడం, కాల్చడం పూర్తిగా నిషేధమని ఏసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. డీజే యజమానులు లైసెన్సులు తీసుకొని ప్రభుత్వ నియమనిబంధనలు పాటించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ సిఐ జయశ్ రెడ్డి, ఎస్సై సాయన్న, పోలీస్ సిబ్బంది, మూడు మండలాల డీజే యజమానులు పాల్గొన్నారు.
