ప్రశాంత వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలను జరుపుకోవాలి
- బోధన్ ఏసీపీ శ్రీనివాస్ రుద్రూర్, బతుకమ్మ : ప్రశాంతమైన వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలను జరుపుకోవాలని, క్రాకర్స్, డిజిలపై నిషేధం విధిస్తున్నట్లు బోధన్ ఏసిపి తెలిపారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో వర్ని ,రుద్రూర్, కోటగిరి మండలాల డీజే యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రశాంతమైన వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలను జరుపుకోవాలని, శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు. ఊరేగింపులు వేడుకల సందర్భంగా డీజేలతో విపరీత శబ్ద కాలుష్యానికి దారి తీస్తున్న...