- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెలోత్ సాయి కుమార్, సూర్య ప్రకాష్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యారంగంలో అసమాన తలను తొలగించడమే భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం (DSFI) లక్ష్యం అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయికుమార్, సూర్య ప్రకాష్ లు అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విశ్రాంత భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా నిజాంబాద్ జిల్లాకు చెందిన రాథోడ్ జీవన్, సాయి కృష్ణ లు డిఎస్ఎఫ్ఐ చేస్తున్న విద్యార్థి పోరాటాలకు ఆకర్షితులై సంఘంలో చేరారు. ఈ సందర్భంగా సాయికుమార్, సూర్య ప్రకాష్ లు మాట్లాడుతూ దేశంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించడం లక్ష్యంగా విద్య కై పోరాడు, ఉపాధికై పోరాడు, విద్యార్థులందరికీ సమాన విద్యాందడమే లక్ష్యంగా, భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై నిరంతర రాజులేని పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 18 నెలలు గడుస్తా ఉన్న విద్యారంగంలో ఎక్కడి సమస్యలు అక్కడే గొంగడిగా పడి ఉన్నట్టు ఉందని, ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా దారుణమని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 8600 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని, సంక్షేమ హాస్టల్లో డైట్ చార్జీలు ఇప్పటివరకు విడుదల చేయలేదని, బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులు ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేస్తుందని అన్నారు. ప్రవేట్ పాఠశాలలో ఫీజులు దోపిడీ నియంత్రణ కమిటీ వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల ఫీజుల దోపిడి అరికట్టాలని డిఎస్ఎఫ్ఐ సమరసిల పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. అనంతరం ఉమ్మడి నిజాంబాద్ జిల్లా అధ్యక్షుడు గా రాథోడ్ జీవన్ ను, కో కన్వీనర్ సాయి కృష్ణ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు విఘ్నేష్, నితిన్, మహేష్, ప్రవీణ్, లక్ష్మణ్ ,అజయ్, సునీల్, మోహన్, నాగేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
