29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్

Must read

📰 Generate e-Paper Clip

  • 20 మందిపై కేసులు నమోదు

 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కంటేశ్వర్ చౌరస్తాలో ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో తమ ట్రాఫిక్ సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మంది వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించి వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు పంపినట్లు సిఐ వివరించారు.

Drunk and Drive Special Drive

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఇకపై ప్రతి వారం ఎక్కడో చోట ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో తనతో పాటు ట్రాఫిక్ ఎస్ఐ చంద్రమోహన్, రహమతుల్లా, శేఖర్, చంద్రశేఖర్ లో తోపాటు మరో 8 సిబ్బంది మంది పాల్గొన్నట్లు ఆయన వివరించారు.

Drunk and Drive Special Drive

More articles

Latest article