22.9 C
Hyderabad

బీజేపీ కి చెందిన దంపతుల పై బిఆర్ఎస్ నేత దాడి

BRS leader attacks a couple belonging to the BJP

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బాధితులను పరామర్శించిన డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి..

కమ్మర్‌పల్లి,బతుకమ్మ :

కమ్మర్ పల్లి మండలంలోని ఇనాయత్‌నగర్ గ్రామానికి చెందిన బీజేపీ కమ్మర్‌పల్లి మండల ఉపాధ్యక్షుడు రవి, ఆయన భార్యపై అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు తీవ్రంగా దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి బాధిత దంపతుల ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆర్మూర్ ఏసీపీని కలిసి ఘటనపై ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ..బీజేపీ కార్యకర్తలపై దాడులు సహించేది లేదన్నారు.కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో కమ్మర్‌పల్లి మండల అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి, మోర్తాడ్ మండల అధ్యక్షుడు శివానంద రెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, చింత ప్రవీణ్‌,పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

BRS leader attacks a couple belonging to the BJP

More articles

Latest article