ఆర్మూర్, బతుకమ్మ : న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని సివిల్ సప్లై హమాలీ కార్మికులు చేస్తున్నా సమ్మె ఆదివారానికి ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎం ఎల్ ఎస్ పాయింట్ వద్దా చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసనకు దిగారు. ఏఐటీయూసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆరెపల్లి సాయిలు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పులను రేవంత్ రెడ్డి సర్కార్ చేయడం సరైంది కాదని అన్నారు. హమాలీలు గొతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదని, గత అరునెలల క్రితం సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా పెంచిన ముడు రూపాయలు పెంచాలని మాత్రమే అడుగుతుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరైనది కాదని అన్నారు. ఇప్పటికే ప్రజా పంపిణి ద్వారా పంపిణీ చేయాల్సిన బియ్యం నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే హమాలీల డిమాండ్స్ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మౌలానా, శ్రీకాంత్, నరేష్, దుర్గం రాజేందర్, మల్లయ్య, పేరోజ్, కిష్టయ్య, జెమునా తదితరులు పాల్గొన్నారు.
