నిజామాబాద్, బతుకమ్మ : ఏఐఎంఐఎం అధ్యక్షుడు ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు నిజామాబాద్ వీక్లీ మార్కెట్‌లోని పండ్ల వ్యాపారులు, కూరగాయల వ్యాపారులతో పాటు ఆదివారం ఏఐఎంఐఎం బృందం మున్సిపల్ కమిషనర్ ను కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసులు వీక్లీ మార్కెట్ నుండి పేద వ్యాపారులు, పండ్ల వ్యాపారులు, కూరగాయల విక్రేతలను తొలగించారని తెలిపారు. పేద వ్యాపారులను అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతించాలని ఏఐఎంఐఎం బృందం మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.

