నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డిస్ట్రిక్ట్ లెవల్ ఈవెంట్ లో భాగంగా శుక్రవారం గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజ్ ఆడిటోరియం లో మాదక ద్రవ్యాల దుర్వినియోగం అవగాహన వారోత్సవాలు, 2025 నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి మహిళా, శిశు దివ్యాంగుల, వయో వృద్దుల సంక్షేమ శాఖ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా పై పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ, నార్కోటిక్స్ శాఖా, సంబందిత అనుబంద శాఖలతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. మహిళ శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో గల సూపర్వైజర్లను, ఒక కమ్యునిటీ కొ-ఆర్డినేటర్, విద్యాశాఖ మరియు ఇంటర్మీడియట్ శాఖ తో , ప్రతీ గ్రామాలలో, పాటశాలలలో ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి జిల్లాలో కల్లు, మత్తు పానీయాలు స్వీకరిస్తూ అనారోగ్య బారిన పడిన వారికి జిల్లా ఆసుపత్రి లో మానసిక ఆరోగ్య వైద్యులు కూడా అందు బాటులో ఉన్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా మాస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. గెలు పొందిన వారికి బహుమలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అడిషనల్ డి.సి.పి. బస్వారెడ్డి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి, జిలా సంక్షేమ అధికారిణి ఎస్.కే. రసూల్ బీ, సైకియాట్రిక్ డా. విశాల్, సైకియాట్రీక్ రవి తేజ, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సి.డి.పి.వో.లు., నషా ముక్త్ భారత్ అభియాన్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ షేక్ వసీం పాల్గొన్నారు.

