27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే జైలు ఖాయం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కామారెడ్డిలో ఒకే రోజు 434 మందికి కోర్టు శిక్షలు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కామారెడ్డి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉల్లంఘనలకు పాల్పడిన 434 మందిని వివిధ కోర్టుల ముందు హాజరుపరచగా, న్యాయస్థానాలు వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు విధించారని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర తెలిపారు. కోర్టులు మొత్తం రూ.4.94 లక్షల జరిమానా విధించగా, 46 మందికి జైలు శిక్షలు ఖరారయ్యాయన్నారు. వీరిలో 29 మందికి ఒక రోజు, 16 మందికి రెండు రోజుల పాటు, ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష విధించబడిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మద్యం మత్తులో వాహనం నడపడం కేవలం చట్ట ఉల్లంఘన మాత్రమే కాదని, అది అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో నిర్లక్ష్య డ్రైవింగ్ ఒకటని పేర్కొన్న ఆయన, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగి అనేక కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయని అన్నారు. క్షణిక ఆనందం కోసం మీ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొద్దని, మీ కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మద్యం సేవించి వాహనం నడపడం మానుకోండని ఎస్పీ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత కఠినతరం చేస్తోందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

More articles

Latest article