26.3 C
Hyderabad
Monday, August 3, 2026

యోగా సాధన ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . యోగా దినోత్సవ కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

యోగా సాధన ద్వారా నిత్య ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. ఈ నెల 21 న నిర్వహించనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే ధన్ పాల్ మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోని 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం యోగా ప్రాధాన్యతను చాటుతోందని పేర్కొన్నారు. జూన్ 21న నూతన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్న యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని యోగా ప్రయోజనాలను పొందాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జె. గంగాదాస్, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా యూత్ ఆఫీసర్ రమేష్, ఆయుష్ డీపీఎం వందన, డాక్టర్ తిరుపతి, ఆయుష్ ఫార్మసిస్టులు పురుషోత్తం, ఉమాప్రసాద్, యోగా అసోసియేషన్ ప్రతినిధి సంగీత, ఆయుష్ సిబ్బంది రమేష్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.

 

One can maintain good health through the practice of yoga.

More articles

Latest article