భీమ్ గల్, బతుకమ్మ
మండలం లోని పలువురు భాధిత కుటుంబాలను శనివారం బీజేపీ కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఇందులో భాగంగా మండలంలోని పురానిపేట్ గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసి రాధాబాయి మరణించడం తో వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కుప్కల్ గ్రామంలో బిజెపి బూత్ అధ్యక్షులు రాజముత్యం వాళ్ళ నాన్న ఇటీవలే అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయా కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట బిజెపి భీమ్ గల్ మండల అధ్యక్షులు ఆరే రవీందర్, పట్టణ అధ్యక్షులు కనికరం మధు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర సయ్య, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్, సీనియర్ నాయకులు ములీగే మహిపాల్,కొండ గంగాధర్,కుంట రాజేశ్వర్, శ్రీనివాస్ యాదవ్,మహిపాల్ మోహన్,హరికృష్ణ,మల్లెల రమేష్, బీజేవైఎం నాయకులు శెట్టి ప్రేమ్ చంద్, ఐటీ విభాగం ఎర్రోళ్ల నరసింహ, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.