తెలంగాణ విశ్వవిద్యాలయంలో యూజీసీ అఫైర్స్ డైరెక్టర్‌గా డా. పాత నాగరాజు
డిచ్‌పల్లి, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగానికి చెందిన సహ ఆచార్యులు, మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన డా. పాత నాగరాజును యూజీసీ అఫైర్స్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి నియామక ఉత్తర్వులను అందజేశారు. డా. పాత నాగరాజు విశ్వవిద్యాలయంలో వివిధ కీలక పరిపాలనా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన అనుభవం కలిగిన విద్యావేత్త. గతంలో అర్థశాస్త్ర విభాగాధిపతిగా, పాఠ్య ప్రణాళిక...