24.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఫ్రెండ్లీ పోలీస్ అని మరవద్దు

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర
  • మద్నూర్ పోలీస్ స్టేషన్, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం సందర్శనలో

 

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సందర్శించారు. సోమవారం ఆయన పోలీస్ స్టేషన్ ను సందర్శించి కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పోలీసు సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందించారు. మద్నూర్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు తెలిపారు. మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంత పరిస్థితులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ తో పాటు బాన్సువాడ డిఎస్పి సత్యనారాయణ, బిచ్కుంద సీఐ నరేష్, ఏఎస్ఐ సుధాకర్ ఉన్నారు.

Don't forget the friendly police.

More articles

Latest article