మీ అధికార దర్పం కోసం పేద ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టకండి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బతుకమ్మ, వేల్పూర్ :- బాల్కొండ నియోజకవర్గం లో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యం చేస్తూ లబ్ధిదారులైన ఆడబిడ్డలని ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎందరో పేదిoటి ఆడబిడ్డ పెళ్లిళ్లకు ఒక మేనమామ కట్నంగా కెసిఆర్ లక్ష రూపాయలు అందజేశారు అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈనెల తీసుకుంటే లక్ష వచ్చే నెలకి అయితే లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని...