కుక్కలు బాబోయ్…

0 11,272
  • భయాందోళనలో స్థానికులు.
  • బెంబేలెత్తుతున్న చిన్నారులు, వృద్ధులు…
  • గుంపులుగా తిరుగుతున్న కుక్కలు

 

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాలంటూ బాబోయ్‌.. కుక్కలు అంటూ ప్రజలు బెంబేలెత్తుతున్నారు.పలు కాలనీల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో చిన్నారులు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్న సంఘటనలు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  చోటుచేసుకుంటున్నాయి. నిజామాబాద్ మున్సిపాలిటీ  లోని 28 వార్డులో చూసినా కుక్కల గుంపు కనబడుతోంది.కాలనీలో ఒంటిరిగా వెళ్లాలంటేనే కాలనీవాసులు జంకుతున్నారు. ఉదయం వేళ స్కూల్‌ బస్సులకు కోసం కాలనీల్లో విద్యార్థులు వేచి ఉంటున్న సందర్భంలో కుక్కల గుంపును చూసిన విద్యార్థులు భయపడుతున్నారు. గాజుల్ పెట్ నుంచి కిల్లా దారిలో ఆదివారం పది కుక్కలున్న గుంపు ఓ ద్విచక్రవాహన చోదకుడిపైకి వచ్చాయి. చాకచక్యంగా అతడు తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. గుంపులు, గుంపులుగా ఉన్న కుక్కలతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. గుంపుగా ఉన్న కుక్కలు చిన్నార్లు పై దాడికి ప్రయత్నించగా స్థానికులు బెదిరించడంతో అవి పారిపోయాయి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి పరిస్థితి పలు కాలోనిల్లో నెలకొందని, కుక్కల బారి నుంచి రక్షించాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఇకనైనా స్పందించి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తొందరగా స్పందించగలరని కాలనీవాసులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.