రుద్రూర్, బతుకమ్మ:
రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్, రాణంపల్లి శివారులోని రామాలయ స్థలానికి సంబంధించిన పూర్తి పత్రాలు అందజేయాలని గ్రామ హిందూ కమిటీ తరుపున మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ తారాబాయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రామాలయం పొలం సర్వే నం. 217/7 అ 1-15 (ఒక ఎకరం 15 గుంటలు) భూమి ఉందన్నారు. 1994 నుండి 2026 వరకు మార్పు చేర్పులకు సంబంధించిన పూర్తి రికార్డు కాపీలు, పహాని నకలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, నాయకులు పార్వతి మురళి, వడ్ల సాయినాథ్, మహేందర్, హిందూ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
