రామాలయ స్థలానికి సంబందించిన పత్రాలు ఇవ్వాలి

రుద్రూర్, బతుకమ్మ:   రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్, రాణంపల్లి శివారులోని రామాలయ స్థలానికి సంబంధించిన పూర్తి పత్రాలు అందజేయాలని గ్రామ హిందూ కమిటీ తరుపున మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ తారాబాయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రామాలయం పొలం సర్వే నం. 217/7 అ 1-15 (ఒక ఎకరం 15 గుంటలు) భూమి ఉందన్నారు. 1994 నుండి 2026 వరకు మార్పు చేర్పులకు సంబంధించిన పూర్తి రికార్డు కాపీలు, పహాని నకలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో...