29 C
Hyderabad
Monday, August 3, 2026

అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

. . . మద్నూర్ ఎస్సై రాజు

 

మద్నూర్, బతుకమ్మ:

 

ఉమ్మడి మద్నూర్ మండల వ్యాప్తంగా ‘అరైవ్ అలైవ్ ’ అవగాహన కార్యక్రమాలు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. మద్నూర్ మండలం మేనూర్ గ్రామములోని కార్యక్రమంలో ఎస్సై రాజు పాల్గొని మాట్లాడుతూ..
అరైవ్ అలైవ్ అనేది ఒక నినాదం కాదు-ఉద్యమంలా సాగాలని, ప్రతీ కుటుంబం ఆనందముతో జీవించాలని, హెల్మెట్ చట్టం కాదు- ప్రాణాన్ని కాపాడే ఆయుధం విధిగ ధరించాలని తెలిపారు. ఈ నెల 13 నుండి 24 వరకు ఈ ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాలు దేశములో నే మొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, డీజీపీ రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా (అరైవ్ అలైవ్) అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ మహత్తర కార్యక్రమం ప్రారంభించడానికి ఒక ముఖ్య కారణం మేనూర్ గ్రామస్తులు ఒక్క రోడ్డు ప్రమాద మరణం అనేది జరగుండా జాగ్రత్తలు తీసుకొని స్పూర్తి దాతలుగా నిలవాలని పేర్కొన్నారు. ఈ “అరైవ్ అలైవ్ అనే ఒక నినాదంలా కాకుండా అందరిలో రోడ్డు ప్రమాదాలు నివారించే ఒక ఉద్యమంలా ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఒక వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలనే వారి కుటుంబ సబ్యుల ఆశను తీర్చే కార్యక్రమం కావాలి. రోడ్డు ప్రమాదాలు మన నిర్లక్ష్యం, అతివేగం, అజాగ్రత్త వల్ల జరుగుతాయని ప్రతీ ఒక్క వాహనదారుడు గ్రహించాలి. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాద మరణాలు జరిగి ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయి. ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యతను గుర్తుంచుకోవాలి. మొబైల్ వాడకం, ఓవర్ స్పీడ్, రాంగ్ దిశలో డ్రైవింగ్ ఎట్టి పరిస్థితులలో చేయవద్దని సూచించారు. మీ కోసం మీ కుటుంబ సబ్యులు ఇంటి వద్ద ఎదురుచూస్తున్నారు అన్న విషయం గుర్తించుకొని జాగ్రత్తగా ప్రయాణాలు కొనసాగించండి అనే సందేశాన్ని ఇచ్చారు. ఈ అవగాహన మద్నూర్, డోంగ్లీ మండల గ్రామ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ సభలలో ప్రతీ ఒక పోలీసు అధికారి పాల్గొని నిర్వహిస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ బాధ్యతగా వాహనాలు నడపాలని ఎస్సై రాజు కోరారు. మేనూర్ సర్పంచ్ అశోక్ పటేల్, ఉప సర్పంచ్‌ మాల్కు, మాజీ సర్పంచ్, విట్టల్ గురూజీ, తుకరం గౌడ్, సురేష్, అంజప్ప, సాయి బాబా, మొఘ సర్పంచ్ బస్వంత్, హళ్ళే నిసార్, హుస్సేన్, అవినాష్, మీరాజ్, వెంకట్, మహారాజ్, హన్మంత్ సౌకార్ తో పాటు యువకులు, గ్రామ ప్రజలు పోలీస్ బృందం పాల్గొన్నారు.

 

Arrive Alive awareness program
Arrive Alive awareness program

More articles

Latest article