27.3 C
Hyderabad
Friday, July 31, 2026

4న జిల్లా స్థాయి క్విజ్ పోటీలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ , నిజామాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు,  మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా జనవరి 4 న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి  క్విజ్ -2025 పోటీ నిజామాబాద్ ఖలీల్ వాడి లో గల రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శనివారం ఉదయం 9.00 గంటలకు ప్రారంభమవుతుందని ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి 70 పాఠశాలల నుంచి 550 మంది విద్యార్థులు ఈ పోటీలకు రిజిస్ట్రేషన్ చేశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ అంకిత్ , కాకతీయ సాండ్ బాక్స్ వ్యవస్థాపకులు రాజు రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ , అడిషనల్ డిసిపి బస్వారెడ్డి , డాక్టర్ విశాల్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరుగుతుందన్నారు.

More articles

Latest article