రాజంపేట, బతుకమ్మ :
రాజంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ సాయిబాబా ఆధ్వర్యంలో సోమవారం గోడ గడియారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏడుగురు లబ్ధిదారులకు గోడ గడియారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ దుబ్బాని శ్రీకాంత్, ఉపసర్పంచ్ ఇమ్రాన్ అలీ, పంచాయతీ కార్యదర్శి బాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముత్యపు సిద్ధరాములు, శ్రీరామ్ సురేష్, మీర్ అహ్మద్ అలీ, ఎండీ సాదుల్లా, నర్సింలు, ఎండీ జమీల్, రహమత్, పంధుల స్వామి, తొడంగలి సిద్ధరాములు, దొబ్బల ప్రవీణ్, దొబ్బల దుర్గం తదితరులు పాల్గొన్నారు.
