. . . కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి
కామారెడ్డి, బతుకమ్మ:
బాలికలు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి ఆకాంక్షించారు. దోమకొండ మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు సోమవారం నగదు బహుమతుల ప్రదానోత్సవం, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థినులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థినుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీరామ్ చిట్స్ సంస్థ నగదు బహుమతులు అందించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి ప్రోత్సాహకాలు విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిరంతరం సహకరించాలని ఆయన కోరారు.

