ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గోడ గడియారాల పంపిణీ
రాజంపేట, బతుకమ్మ : రాజంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ సాయిబాబా ఆధ్వర్యంలో సోమవారం గోడ గడియారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏడుగురు లబ్ధిదారులకు గోడ గడియారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంస్థల ప్రతినిధులు...