మాచారెడ్డి, బతుకమ్మ: మండలం లోని లచ్చపేట ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు కామారెడ్డికి చెందిన హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పరీక్ష సామగ్రిని అందజేశారు. ఈ సందర్బంగా పదో తరగతి తర్వాత ఎంచుకోవాల్సిన అంశాలపై విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు కృష్ణాకర్, కృష్ణారావు, రజినీకాంత్, నవీన్, శ్రీకాంత్ రావు, హెచ్ఎం లక్కిరెడ్డి రాజేశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
