23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

ధర్మారంలో సన్నబియ్యం పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

డిచ్ పల్లి, బతుకమ్మ: మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో సన్న బియ్యం పంపిణీని కాంగ్రెస్ మైనార్టీ విభాగం జనరల్ సెక్రటరీ షేక్ అబ్దుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సన్న బియ్యం అందజేస్తున్నారన్నారు. ఇక నుంచి పేదలందరికీ సన్న బియ్యం మాత్రమే పంపిణీ అవుతుందని, పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పాటుపడుతోందని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీటీసీ మురళి, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article