జుక్కల్, బతుకమ్మ :
జుక్కల్, పెద్ద కొడప్ గల్ మండల కేంద్రాల్లో మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.

