బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మండల జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ ను ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ జిన్న జగ్జీవన్ ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఇలాంటి పదవులు మరెన్నో చేపట్టాలని, ప్రజలకు మేలు చేయాలని, సమాజంలో కలం సైనికుల సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో బుడిమి మాజీ సర్పంచ్ లక్ష్మీనాం దేవ్, సొసైటీ డైరెక్టర్ నర్వ శంకర్, గ్రామస్తులు నాగాదర్ డాక్టర్ గోవింద్, జిన్న రవి, నర్వ నారాయణ, జిన్నా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
