నిజమాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని సుభాష్ నగర్ లో గల అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు బాధితుల నుండి వస్తున్నా దరఖాస్తులు పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా సీఎం సహాయ నిధికి వెంటనే పంపుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం చెక్కుల జారీ విషయంలో కొంత జాప్యం కారణంగా బాధితులు దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 15% నుండి 20% వరకే చెల్లిస్తున్నారి తెలిపారు. దీని కారణంగా పేద మధ్యతరగతి బాధిత కుటుంబాలకు చికిత్స ఖర్చు ఆర్ధిక భారంగా మారుతుందన్నారు. జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల జాప్యం, దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 50% చెల్లించే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే మొదటి లక్ష్యం అని రాబోయే రోజుల్లో నిజామాబాదు ప్రభుత్వ హాస్పిటల్ ను అధునాతన సౌకర్యాలతో నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
