24.7 C
Hyderabad
Monday, August 3, 2026

అడ్లూర్ ఎల్లారెడ్డిలో మట్టి ప్రతిమల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

సదాశివ నగర్, బతుకమ్మ : సదాశివ నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఆవరణలో మట్టి వినాయక విగ్రహాలను సీనియర్ జర్నలిస్ట్ రాంశెట్టి భూపతి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారీస్ ఆధ్వర్యంలో 500 వినాయక ప్రతిమలను గ్రామస్తులకు అందించారు. మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసినందుకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి సిడిసి చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్, అడ్లూర్ ఎల్లారెడ్డి సోసైటీ చైర్మన్ సదాశివ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోలిపెల్లి మహేందర్ రెడ్డి, వీడిసి అధ్యక్షులు మదాం సత్యం, వ్యాపారవేత్త పైడి సంతోష్ రెడ్డి, నాయకులు పైడి జనార్దన్, శ్రీనివాస్ శర్మ పంతులు,  చక్రధర్ గౌడ్, గడ్డం రాజ్ కుమార్, ఆకుల కృష్ణ, సురేష్ రెడ్డి, గంగాధర్,  సంగారెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Distribution of clay idols in Adlur Yella Reddy

More articles

Latest article