27.4 C
Hyderabad

ఏర్గట్ల స్కూల్ విద్యార్థులు మట్టి గణపతుల తయారీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: గణపతి పండుగ వినాయక చవితి నీ పురస్కరించుకొని ఏర్గట్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు మట్టితో గణపతిలు తయారీ చేసి అందరిని అలరించారు. సుమారు వందకు పైగా విద్యార్థులు ఈ మట్టి గణపతులను వివిధ ఆకృతులలో చేయడం జరిగింది.విద్యార్థులకు ప్రకృతి పట్ల అభిమానం కలిగించడం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు అందరు కూడా నడుం బిగించే విధంగా విద్యార్థులచే మట్టి గణపతులు సిద్ధం చేసి వాటిని పండుగ రోజున ఇంటి లోపల పూజల కోసం వినియోగించడం అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణాచారి,ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని గూర్చి పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి  మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం పాటుపడాలని దానిలో భాగంగానే మట్టితో తయారుచేసిన విగ్రహాలను ఇంటి లోపల ప్రతిష్టించుకొని నిమజ్జనం రోజున ఈ మట్టి గణపతులను నీళ్లలో వదలడం ద్వారా ఇలాంటి నీటి కాలుష్యం ఉండదని అందుకే ప్రతి ఒక్కరు మట్టి గణపతులతో పూజలు నిర్వహించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాద్ రాజనర్సయ్య,రాజేందర్,ఎస్ శ్రీనివాస్,విజయ్,రాజశేఖర్,కె శ్రీనివాస్,ప్రవీణ్ శర్మ,గంగా మోహన్,జ్యోతి,కోమలి పాల్గొన్నారు.

More articles

Latest article