26.2 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యార్థులను ప్రోత్సహించేందుకే పుస్తకాలు, పెన్నుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

  • సేవాలాల్ సంఘ ప్రెసిడెంట్ భూక్యా లింబాద్రి.

 

భీమ్ గల్, బతుకమ్మ : విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో, వారిని ప్రోత్సహించేందుకే విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణి చేయడం జరిగిందని సేవాలాల్ సంఘం ప్రెసిడెంట్ భూక్యా లింబాద్రి అన్నారు. మంగళవారం సంఘం ప్రతినిధులతో కలిసి దేవాన్‌పల్లిలోని అప్పర్ ప్రైమరీ స్కూల్ ను సందర్శించి ఆ స్కూల్ కు చెందిన 40మంది విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు సహాయం చేయడం తమ సామాజిక బాధ్యత అని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను ఇలానే కొనసాగిస్తామన్నారు.  సంఘ సామాజిక సేవను ఉపాధ్యాయులు,విద్యార్థులు ముక్తకంఠంతో అభినందించారు. ​ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డా. శ్రీకాంత్ రామావత్, సేవాలాల్ సంఘము వైస్ ప్రెసిడెంట్ బోడ అరుణ్, దేవన్ పల్లి బీజేపీ సర్పంచ్ అభ్యర్థి రామావత్ వెంకటేష్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలం శ్రీనివాస్,ఉపాధ్యాయులు, సేవాలాల్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article