భీమ్ గల్, బతుకమ్మ : భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను, పాలనను చూసి ఆకర్షితులై మండలంలోని సికింద్రాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన మైనార్టీ యువ నాయకుడు అబ్దుల్ సద్దాం తన అనుచరులతో కలిసి , మాజీ మండల పార్టీ అధ్యక్షులు ములీగే మహిపాల్ ఆధ్వర్యంలో చేరారు. వారికి నిజామాబాద్ జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ కైసర్ చౌస్ మండల పార్టీ ప్రెసిడెంట్ ఆరే రవీందర్ లు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అనగానే కొందరు కావాలని ముస్లింలకు వ్యతిరేక పార్టీ అని దుష్ప్రచారం చేస్తారని, బిజెపి పార్టీ సమస్త ప్రజల కోసం, దేశం కోసం మాత్రమే పనిచేస్తుందని, మన సొంత ఇంట్లోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే మనం ఎలా తరిమికొడతామో మోడీ కూడా భారతదేశాన్ని తన సొంత ఇల్లుగా భావించి ఇందులోకి అక్రమంగా ఎవరొచ్చినా తరిమికొడుతున్నరన్నారు. మోదీ ఆధ్వర్యంలో బిజెపి సర్కార్ చేస్తున్న అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను చూసి రానున్న రోజులలో మైనార్టీ సోదరులు వేలాదిగా పార్టీలో చేరుతారన్నారు. తెలంగాణలో రానున్నది బిజెపి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రెసిడెంట్ కనికరం మధు,కిసాన్ మోర్చా మండల ప్రెసిడెంట్ తోట గంగాధర్, మైనార్టీ మోర్చా ప్రెసిడెంట్ హకీం,సయ్యద్ హకీమ్, మహమ్మద్ ఇస్మాయిల్, అబ్దుల్ మౌలానా, మహమ్మద్ అక్బర్, షేక్ షఫీ,సుదర్శన్ పాల్గొన్నారు.
