విద్యార్థులను ప్రోత్సహించేందుకే పుస్తకాలు, పెన్నుల పంపిణీ
సేవాలాల్ సంఘ ప్రెసిడెంట్ భూక్యా లింబాద్రి. భీమ్ గల్, బతుకమ్మ : విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో, వారిని ప్రోత్సహించేందుకే విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణి చేయడం జరిగిందని సేవాలాల్ సంఘం ప్రెసిడెంట్ భూక్యా లింబాద్రి అన్నారు. మంగళవారం సంఘం ప్రతినిధులతో కలిసి దేవాన్‌పల్లిలోని అప్పర్ ప్రైమరీ స్కూల్ ను సందర్శించి ఆ స్కూల్ కు చెందిన 40మంది విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు సహాయం చేయడం తమ సామాజిక బాధ్యత అని,...