28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఉద్యోగస్తు లపై వివక్ష దుర్మార్గ చర్య

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

 నిజామాబాద్, బతుకమ్మ :

ప్రస్తుత ప్రభుత్వ హయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఉద్యోగస్తు లపై అగ్రవర్ణాల నేతల వివక్ష దుర్మార్గ చర్య అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు  అవేదన వ్యక్తం చేశారు.జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ నగర్ లో గల న్యూ పెన్షనర్స్ భవనంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగుల, మేధావుల విద్యావంతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరై మాట్లాడుతూ బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ వర్గాల ఉద్యోగస్తులపై వివక్ష కొనసాగుతుందన్నారు. ఉన్నత వర్గాల వారు గ్రామంలో సామాన్య ప్రజల విద్య, ఉద్యోగానికి, అధికారానికి దూరం చేస్తూ దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాచీన కాలం నాటి బానిస సంస్కృతి మనపై రుద్దే ప్రయత్నం మనువాదులు ముమ్మరం చేస్తూ దారిద్ర్యం లోకి నేడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీలు సంఘటిత మై చారిత్రక,సామాజిక సాంస్కృతిక,రాజకీయ వారసత్వాన్ని ప్రతి ఒక్కరం ఏకతాటి పై ఉండి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ ఆమోదం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ప్రో కనకయ్య, రాష్ట్ర కోఆర్డినేటర్ కె.రాజేందర్, అడ్వకేట్ రాష్ట్ర కన్వీనర్ సి.హెచ్.నాగభూషణం, ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్య వంశీధర్, డాక్టర్ చేగంటి ఈశ్వర్, డా చిలుక భాస్కర్, డిసిఇబి కార్యదర్శి సీతయ్య, వినోధ్ కుమార్  పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article