29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

డబుల్ బెడ్ రూంలు పంపిణీ చేయాలని ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : డబుల్ బెడ్ రూంలు పంపిణీ చేయాలని లబ్దిదారులు బుధవారం ఎల్లారెడ్డి  మండల కేంద్రంలో ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు అర్హత పత్రాలు కొంతమందికి మాత్రమే పంపిణీ చేశారని తెలిపారు.  మిగిలిన లబ్దిదారులు తమకు ఇప్పటి వరకు పంపిణీ చేయక పోవడంతో స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చారు. అక్కడ అధికారులనుండి సరైన సమాధానం రాకపోవడంతో లబ్ధిదారులు రోడ్డున బైటాయించారు.  సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ ఐ మహేష్, డిప్యూటీ తహశీల్దారు వచ్చి సోమవారం వరకు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Dharna to distribute double bed rooms

More articles

Latest article