తాడ్వాయి, బతుకమ్మ : మాఘ అమావాస్య సందర్బంగా తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామం శ్రీ భీమేశ్వర స్వయంభూ లింగ దివ్య క్షేత్రం మాఘ అమావాస్య మహా జాతరలో బుధవారం ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే భక్తులతో కలిసి తీర్థ ప్రసాదలు స్వీకరించి, ఉద్దేశించి ప్రసగించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను సన్మానించారు.

