సిపిఎం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
ఆర్మూర్, బతుకమ్మ : సిపిఎం జిల్లా కమిటీ పిలుపులో భాగంగా సోమవారం ఆర్మూర్ తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సిపిఎం ఆర్మూరు డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తవుతుందని ఎన్నికల ముందు గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు కానీ నేటికీ మహిళలకు 2500,ఇవ్వటం లేదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ కూలీలందరికీ 12 వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అన్నారు...