ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశానుసారం ఆర్మూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బిజెపి జిల్లా కార్యదర్శి గంగోని సంతోష్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ పంపిణీ చేశారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ పట్టణ ఎన్నికల ఇన్చార్జ్, బిజెపి జిల్లా కార్యదర్శి గంగోని సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగోని సంతోష్ మాట్లాడుతూ జాతీయ పార్టీ ఆదేశాలతో రాష్ట్ర పార్టీ, రాష్ట్ర పార్టీ ఆదేశాలతో జిల్లా పార్టీ, జిల్లా పార్టీ ఆదేశాలతో ఆయా కార్పోరేషన్లలో, పట్టణాలలో, మండలాలలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. ఆర్మూర్ పట్టణంలో 60 బూత్ అధ్యక్ష, కార్యవర్గాన్ని ఎన్నుకొని మూడు రోజులలో జిల్లా పార్టీకి అప్పగించవలసిన అవసరం ఉందని అన్నారు. ఆర్మూర్ పట్టణ కార్యవర్గాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందని, మున్సిపాలిటీలో ఉన్నటువంటి 60 బూతులలో బూత్ కమిటీలను సత్వరమే ఏర్పాటు చేయడానికి సమాయత్తమై ప్రస్తుతం ఉన్నటువంటి కార్యవర్గం శ్రద్ధ తీసుకొని ఆయా నాయకులను, శక్తి కేంద్ర ఇన్చార్జిలను కలిసి సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసి ఆర్మూర్ పట్టణ కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయేటటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ పడి, ఎదుర్కొని, గెలవడానికి ఈ ఎన్నికలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కాబట్టి కార్యకర్తలు, నాయకులు సంస్థాగత ఎన్నికల్లో చురుకుగ సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్ పాల్గొన్నారు.
