నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వరంగ బ్యాంకులను, ఎల్ ఐ సి వంటి ఇన్సూరెన్స్ కంపెనీలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎల్లమ్మ గుట్టలోని ఎల్ఐసి కార్యాలయం ముందు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కార్యదర్శి రాజేష్ శ్రావణ్ మాట్లాడుతూ భారతీయ జీవిత బీమా సంస్థలో నూతన ఉద్యోగాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా 2012-2013 బ్యాచ్లకు పెన్షన్ మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ రంగంలో నూతన ఉద్యోగాలు కల్పించకుండా ఔట్సోర్సింగ్ విధానాన్ని తీసుకువచ్చి ఉద్యోగుల నడ్డి విరిచారని విమర్శించారు. ఇన్సూరెన్స్ రంగంలో జిఎస్టిని పూర్తిగా రద్దు చేయాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నపించిన నేటికీ ఆ కోరికను నెరవేర్చకుండా ప్రజలపై పన్నుభారాన్ని మోపుతున్న ఈ పాలకులను గద్దెనింపాలంటే డిమాండ్ చేశారు. బోధన్ బ్రాంచ్ ఐసి ఈ యూ ఉపాధ్యక్షులు సక్కి సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని దీనికి కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలే కారణమని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు రంగాన్ని పూర్తిగా దివాలా తీయించి ఉద్యోగ, కార్మికులను రోడ్డుపైకి తీసుకొచ్చే కుట్రలు చేస్తున్నారని కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలోఐసీయూ. బ్రాంచ్ అధ్యక్షులు , సామ్రాట్, సెక్రటరీ సురేష్, రిటైర్డ్ నాయకులు దారం పోతన్న, సభ్యులు పి శివశంకర్, సత్యనారాయణ, దేవచారి శశి కుమార్ తాత్కాలిక కార్మికులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
