కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో 20వేల సైకిళ్ల పంపిణీ ప్రారంభం
తన పుట్టినరోజు కానుకగా చేపట్టిన కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్, బతుకమ్మ : కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పుట్టినరోజును (ఈనెల 11న ) పురస్కరించుకొని 20వేల సైకిళ్ల పంపిణీని బుధవారం కరీంనగర్ లో ప్రారంభించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఈ సైకిళ్లను అందించనున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలచుకుంటే అద్భుతాలు చేయగలరని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్య కోసం రూ.1.28 లక్షల కోట్లు కేటాయించిందన్నారు.

