28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

విధుల బహిష్కరించి పవర్ హౌస్ లో నిరసన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విద్యుత్ రంగ ప్రైవేటీకరణ, ఫ్రాంచైజ్ విధానాలకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు బుధవారం టి.జి.ఎన్.పి.డీసిఎల్ నిజామాబాద్ సర్కిల్ కార్యాలయం ప్రాంగణంలో విద్యుత్ ఉద్యోగులు గా పాల్గొన్న పనిముట్టు, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. జేఏసీ రాష్ట్ర కార్యచరణ కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ (సవరణ) బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ రఘునందన్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ అమలవుతే ప్రజలకు భారమైన టారిఫ్‌లు, వ్యవసాయదారులకు సబ్సిడీ తగ్గింపు, ఉద్యోగ భద్రతపై ముప్పు, సామాన్యులపై భారం తప్పదని హెచ్చరించారు. జేఏసీ కో చైర్మన్ పి.గంగాధర్ మాట్లాడుతూ  “ఇంకలాబ్ జిందాబాద్”, “విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ చేయొద్దు”, జేఏసీ కన్వీనర్ ఆర్ బాలేష్ కుమార్ మాట్లాడుతూ “ఫాంచేజీ విధానాలను వెంటనే ఆపాలి” నిరసన వ్యక్తం చేశారు. క్రాస్ సబ్సిడీ ఉండదని ఈ నిరసనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలని పిలుపునిచ్చారు. జేఏసీ కో కన్వీనర్ తోట రాజశేఖర్ మాట్లాడుతూ జాతీయ విద్యుత్ జేఏసీ ఎప్పుడు కాల్ ఇచ్చిన గాని మనమంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యుత్ రంగం ప్రజల హక్కుగా ఉండాలని, లాభాల కోసం ప్రైవేటీకరణ చేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు. ప్రజా రంగ విద్యుత్ సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ రఘునందన్, కోచ్ చైర్మన్ పి గంగాధర్, కన్వీనర్ బాలేష్ కుమార్, కో కన్వీనర్ తోట రాజశేఖర్, నాయకులు కాశీనాథ్, ఆర్.చంద్రశేఖర్, నాంపల్లి వేణుగోపాల్, రాజేందర్ రెడ్డి, చెన్నయ్య, అశోక్, ప్రసాద్ రెడ్డి, రాజేందర్ గౌ,డ్ పిఓ పోశెట్టి, ఉమారాణి, సునీత, సుహాసిని, లింగం మూర్తి, జి.శ్రీనివాస్, రామకృష్ణ, సతీష్ పాల్గొన్నారు.

Protest to the Power House by Boycotting Duties

More articles

Latest article