30.9 C
Hyderabad
Monday, August 3, 2026

గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, సమస్తా పెన్షన్దారులు, బీడీ కార్మికులు, మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమస్త పెన్షన్ దారులకు వికలాంగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనీ డిమాండ్ చేస్తూ కొత్తగా ఫించన్ కొరకు దరఖాస్తులు చేసుకున్న వారందరికీ 4 వేలు, వేలు ఇస్తానని,  వికలాంగులకు 6వేలు, ఇస్తానని మాట తప్పినందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహిచడంలో బాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ గొల్లపల్లి  గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ కు  వినతి పత్రం అందచేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ పి జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మణ్ మాదిగ,వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ శోభా రాణి,ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అందే సామ్యూల్ మాదిగ,విహెచ్పిఎస్ నాయకురాలు అంజలి, నాగరాజు, అంజవ్వ, ఎల్లవ్వ, సునంద, రేణుక, నరసయ్య ,బాలయ్య తో పాటు పలువురు దారులు పాల్గొన్నారు.

Dharna in front of Gollapalli Gram Panchayat office

More articles

Latest article