25.4 C
Hyderabad

అభివృద్ధి పనులు వేగంగా జరగాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ కాసుల బాలరాజు

 

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరగాలని ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ కాసుల బాలరాజు అధికారులను ఆదేశించారు.బాన్సువాడ పట్టణంలోని పోలీస్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మెదక్-బాసర హైవే పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పనులను కాసుల బాలరాజు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ జంగం గంగాధర్ పరిశీలించారు. ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి సూచన మేరకు బాన్సువాడ పట్టణంలో డ్రెయినేజీ, ఫుట్​పాత్ పనులు వేగంగా జరగాలని హైవే అధికారులకు సూచించారు. బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా కాంప్లెక్స్​ల ఎదుట డ్రెయినేజీ పూడికను తొలగించి అడుగు ఎత్తు పెంచాలని, త్వరితగతిన ఫుట్​పాత్​ నిర్మాణాన్ని పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని అధికారులకు కాసుల బాలరాజు సూచించారు. స్థానికులు స్వచ్ఛందంగా డ్రెయినేజీలపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని కోరారు. ఆయనతో పాటు నాయకులు ఎజాజ్, ఖలేక్, హైవే ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

More articles

Latest article