24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉన్నత అర్హతల వారికే డిప్యూటీ డీఈఓ పోస్టులు ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎఐఎస్ బి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్పీ ద్వారా భర్తీ చేయనున్న డిప్యూటీ డీఈఓ విద్యాశాఖ అధికారి పోస్టులకు కేవలం డిగ్రీ,పీజీ అర్హతలను మాత్రమే నిర్దేశించడం సరైన విధానం కాదని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు. విద్యారంగానికి సంబందించిన ఈ కీలక పోస్టులను బీఈడీ, పీఏచ్ డీ వంటి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయ శిక్షణ అనుభవం కలిగిన వారిని పర్యవేక్షణ అధికారులుగా నియమిస్తేనే విద్యారంగంలో నాణ్యత పెరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఈఎడ్, ఎంఈడీ పూర్తి చేసిన వేలాది మంది అభ్యర్థులు ఉన్నపటికి వారికి అవకాశం లేకపోవడం చాలా అన్యాయమని ఆయనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ పునః సమీక్షించి తగిన మార్పులు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

More articles

Latest article