23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

 కొడుకును మట్టుబెట్టిన  తండ్రి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సహకరించిన సోదరుడు.. తల్లి

. . . మద్యానికి బానిసై వేధిస్తుండటంతో ఘాతుకం

. . . జిపిఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి చేదించిన పోలీసులు

 బాన్సువాడ, బతుకమ్మ:

మద్యానికి బానిసైన కొడుకు నిత్యం తాగి వచ్చి తల్లిదండ్రులను వేధిస్తుండటంతో తండ్రి, మరో కొడుకు కలిసి మట్టుబెట్టారు. అపై అతడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అని నమ్మించేందుకు తండ్రి కొడుకులకు తల్లితో కలిసి పథకం రచించారు. హడావిడిగా  అంత్యక్రియలు  నిర్వహణ చేసేందుకు ప్రయత్నించిన పంచాయతీ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు కదిలిన పోలీస్  యంత్రాంగం విచారణ జరిపి అది రోడ్డు ప్రమాదం కాదు, హత్య గా తెల్చారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… కామారెడ్డి జిల్లా బీర్కుర్ కు చెందిన గంగారాం, స్వరూప దంపతులకు లక్ష్మణ్, శ్రీకాంత్ లు సంతానం. లక్ష్మణ్ మద్యానికి బానిస. డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధిస్తు కొట్టాడు. మే 21న మద్యం మత్తులో లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బుల కోసం తల్లిదండ్రులను విపరీతంగా చితకబాదాడు. విషయం తెలిసిన చిన్న కుమారుడు శ్రీకాంత్, తండ్రి గంగారంలు లక్ష్మణ్ తో గొడవ పడ్డారు. అవేశంతో కర్రలతో లక్ష్మణ్ తలపై మొదారు. దానితో లక్ష్మణ్ అక్కడికక్కడే చనిపోయారు. లక్ష్మణ్ చనిపోవడంతో ఇంట్లో రక్తపు మరకలను తుడిచి వేసి కర్రలను దాచేశారు. రోడ్డు ప్రమాదంలో లక్ష్మణ్ చనిపోయాడని బందువులను, గ్రామస్థులను నమ్మించి హడావిడిగా అంత్యక్రియలు చేసేశారు. ఉదయం వేళ హడావిడిగా అంత్యక్రియలు కార్యక్రమం చూసి జి పి ఓ శ్రీనివాస పోలీసులకు అనుమానం పై ఫిర్యాదు చేశారు. బాన్సువాడ రూరల్ సిఐ తిరుపతయ్య, ఎస్ఐ రాములు తో కలిసి విచారించారు. గంగారం, శ్రీకాంత్ లను అదుపులోకి విచారించగా మద్యం మత్తులో వేధింపులకు పాల్పడటం తో తామే హత్య చేసినట్లు అంగీకరించిన. ఇద్దరిని అరెస్టు చేసినట్లు, హతుడి తల్లి స్వరూప పరారీలో ఉందని డిఎస్పీ తెలిపారు.

More articles

Latest article