28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

యోగా వాక్ ను విజయవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా ఆయుష్ ఇంచార్జి డా.జె.గంగాదాస్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో యోగా వాక్ నిర్వహిస్తున్నామని, ప్రజలందరు కలిసి యోగా వాక్ ను విజయవంతం చేయాలని జిల్లా ఆయుష్ ఇంచార్జి డా.జె.గంగాదాస్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని 4వ అంతస్తులో ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 21 న ఉదయం 7 గంటలకు పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి పాత కలెక్టర్ గ్రౌండ్ వరకు యోగా వాక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పట్టణంలోని ప్రజలందరు ఈ యోగా వాక్ లో పాల్గొనెలా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్ వైకె జిల్లా కో ఆర్డినేటర్ బి.రమేష్, జిల్లా యోగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రాంచందర్, అధ్యక్షులు యోగా ప్రభాకర్, ప్రతినిధులు సిద్ది రాములు, వేదమిత్ర, సంగీత, బాలశేఖర్, బుచ్చన్న, గంగాధర్, యోగా గురువులు, యోగా వైద్యుడు డాక్టర్ తిరుపతి, ఆయుష్ ఫార్మాసిస్ట్ లు న్యావనంది పురుషోత్తం, ఉమప్రసాద్, స్టాఫ్ రమేష్, భిక్షపతి పాల్గొన్నారు.

More articles

Latest article