26.2 C
Hyderabad
Monday, August 3, 2026

108 అంబులెన్సులో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బండ రెంజల్ గ్రామానికి చెందిన స్రవంతి నిండు గర్భిణీని పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ లో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి  తరలించగా వైద్యుల సూచన మేరకు అత్యవసరంగా నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో అంబులెన్స్ లోనే మహిళ ప్రసవించిన సంఘటన బాన్సువాడ నియోజక వర్గం లో చోటుచేసుకోంది. వివరాల్లోకి వెళ్లితే.. స్రవంతి నిండు గర్భిణీ. మంగళవారం  పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు కాల్ చేశారు. సమయానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది సదరు  మహిళను బాన్సువాడ ఏరియా ఆసుపత్రి కి తరలించేందుకు మహిళను తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్తున్న క్రమంలో ఆమెకు మార్గమధ్యలోనే నొప్పులు ఎక్కువ అవడంతో సిబ్బంది అంబులెన్స్ లోనే ప్రసవం చేశారు. పుట్టిన శిశువుతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉందని ఈఎంటీ బాల్ రాజ్, పైలెట్ రామారావులు తెలిపారు.

More articles

Latest article