108 అంబులెన్సులో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బండ రెంజల్ గ్రామానికి చెందిన స్రవంతి నిండు గర్భిణీని పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ లో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు అత్యవసరంగా నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో అంబులెన్స్ లోనే మహిళ ప్రసవించిన సంఘటన బాన్సువాడ నియోజక వర్గం లో చోటుచేసుకోంది. వివరాల్లోకి వెళ్లితే.. స్రవంతి నిండు గర్భిణీ. మంగళవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు కాల్ చేశారు. సమయానికి...