- ఆర్మూర్ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ పి.వినయ్ రెడ్డి
ఆర్మూర్, బతుకమ్మ : రాష్ట్ర కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకే సంతకాల సేకరణ కార్యక్రమంను చేపట్టినట్లు ఆర్మూర్ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని చేపూర్ గ్రామంలో మండల పార్టీ ప్రెసిడెంట్ చిన్నరెడ్డి ఆధ్వర్యంలో ఓటు చోరికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చెపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో పార్టీ క్యాడర్ ను అఖండ మెజారిటీతో గెలిపించుకొనేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు ఐక్యంగా పని చెయ్యాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఆర్మూర్ గుండ్ల చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ శాఖ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, చేపూర్, పల్లె గ్రామాల అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, రాంసన్ మాజీ ఎంపీటీసీలు గంగాధర్, ఎల్కరంజిత్, సురేష్ రాజు, చిట్యాల పోశెట్టి, శాంతికుమార్, గంగసాయన్న, డి.రమేష్, దాసరి నాగరాజు, డి.సాయన్న, చరణ్, నితిన్ ఆర్మూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్లు పవన్ పండిట్, అయ్యప్ప శీను, వెంకట్రాం రెడ్డి,అమృత రావు, శాల ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్లు పవన్ పండిత్, అయ్యప్ప శీను, తదితర నాయకులు కార్యకర్తలు అనుచరులు అభిమానులు పాల్గొన్నారు.
