25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఢిల్లీ లిక్కర్స్ స్కాం కేసు కొట్టివేత 

Must read

📰 Generate e-Paper Clip

 

.  . . సిబిఐ చార్జి షీట్ లో ఆధారాలు లేవని కొట్టివేసిన రౌజ్ అవెన్యూ కోర్ట్ 

 

. .  . ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట

 

 ఢిల్లీ, బతుకమ్మ :

 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును కోర్టు కొట్టి వేసింది. ఢిల్లీలో మద్యం పాలసీ అమలు విషయంలో అవినీతి అక్రమాలపై సిబిఐ కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్, మాజీమంత్రి సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు 29 మందిపై అభియోగాలు నమోదుచేసి అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆనాడు ఢిల్లీ ముఖ్యమంత్రి గా ఉన్న కేజ్రీవాల్ తో పాటు సిసోడియా, అప్పటి ఏమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లపై మనీ లాండేరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా అందరూ తీహార్ జైలు జీవితం గడిపారు..సిబిఐ స్పెషల్ కోర్ట్ న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఈ మేరకు సిబిఐ నమోదు చేసిన కేసును కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.సిబిఐ కేసును శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు కొట్టి వేసింది. సిబిఐ నమోదు చేసిన కేసులో చార్జెషీట్ లో ఎలాంటి ఆధారాలు లేవని కేసును కొట్టివేశారు. 29 మంది పై వచ్చిన అభియోగాలను నిరధారం అని అందరికి క్లీన్ చీట్ ఇచ్చింది. సిబిఐ కేసు ను రౌస్ అవెన్యూ కోర్ట్ కొట్టివేసిన ద్విసభ్య ధర్మసానం తోపాటు హై కోర్ట్ లో సవాల్ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ కేసును కోర్ట్ కొట్టివేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు కొనసాగుతుంది.

Delhi Liquor Scam Case Dismissed

.  .  . కన్నీటి పర్యంతమైన కేజ్రీవాల్ 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును రౌస్ అవెన్యూ కోర్ట్ కొట్టి వేయడం తో మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. న్యాయం గెలిచిందని బావోద్వేగానికి గురయ్యారు. తాను తప్పు చేయలేదని దానిని కోర్టు లో రుజువు అయిందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తప్పు చేయలేదని క్లీన్ చీట్ ఇచ్చారు.రౌస్ అవెన్యూ కోర్ట్ సిబిఐ నమోదు చేసిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును కొట్టి వేయడం తో అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా ల పై ఆరోపణలు చేసారు. ఆమ్ ఆద్మీ పార్టీ ని నాశనం చేయాలని అక్రమ కేసులు నమోదు చేసారు అని ఆరోపించారు.. ప్రజాస్వామ్య బద్ధంగా గెలువలేక అక్రమ కేసులు నమోదు చేసి సిట్టింగ్ సీఎం ను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. తాను ఇప్పటి వరకు తప్పు చెయలేదని, తమ పార్టీ నాయకులకు కోర్ట్ క్లీన్ చీట్ ఇచ్చిందని గుర్తు చేశారు. రాజ్యంగం పై, దేశ న్యాయ వ్యవస్థ పై తీర్పు నమ్మకం కలిగిచ్చిందని అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజా సమస్య లు పట్టించుకోలేదని అన్నారు. రాజకీయ పార్టీ లను టార్గెట్ చేసి గెలువడం కాదని, ప్రజా స్వామ్యం లో ప్రజల తీర్పు కోరాలని హితువు పలికారు.

Delhi Liquor Scam Case Dismissed

సిబిఐ నమోదు చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ను రౌస్ అవెన్యూ కోర్ట్ కొట్టి వేయడం తో తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ఏమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆంధ్ర కు చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి,మిథున్ రెడ్డి లకు ఊరట కల్గించింది. సిబిఐ కేసు తో పాటు ఇడి కేసులో కవిత ను అరెస్ట్ చేయగా జైలు జీవితం గడిపారు. కవిత తీహార్ జైలు కు వెళ్లడం గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపి అపార్టీ ఓటమి పాలైంది. కవిత బిఆర్ ఏస్ కు రాజీనామా చేసి సొంత పార్టీ నాయకుల పై సంచలన ఆరోపణలు చేసారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు.జూన్ లో కొత్త పార్టీ పెట్టే సమయం లో సిబిఐ కేసును కోర్ట్ కొట్టివేయడం పై తెలంగాణ జాగృతి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

More articles

Latest article