26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామస్థాయిలో ప్రచారం

Must read

📰 Generate e-Paper Clip

 

. .  . సిపిఎం రాష్ట్ర నాయకులు బుర్రి ప్రసాద్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇటీవల తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మార్పు చేస్తూ ఉపాధి కూలీలకు పుట్టగొట్టే జి రాంజీ చట్టం, విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ చట్టం, కార్మిక చట్టాలను మారుస్తూ తెచ్చిన నాలుగు కోడ్స్ పైన గ్రామస్థాయిలో పోరాటానికి ప్రజలను సన్నద్ధం చేయటానికి ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు బుర్రి ప్రసాద్ పిలుపునిచ్చారు. నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు పెన్షన్ల పెంపుదల, మహిళలకు శ్రీ లక్ష్మీ పథకం అమలు, ఇండ్ల నిర్మాణం కై ఇండ్ల స్థలాల పంపిణీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి, తదితర అంశాల పైన ప్రజా పోరాటాలు నిర్వహించటానికి పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని అందువల్ల పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేయటానికి వివిధ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని కొంతమంది కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ అట్టడుగు వర్గాల ప్రజలకు నష్టం చేకూర్చే పద్ధతుల్లో నిర్ణయాలు చేయడం జరిగిందన్నారు. వాటిని వెనక్కి తీసుకునే వరకు పోరాటాలు నిర్వహించాలని, అందుకొరకు గ్రామస్థాయి నుంచి ప్రజలను సన్నద్ధం చేయాలని నిర్ణయించారు. గ్రామస్థాయిలో దరఖాస్తులను ఇప్పించడంతోపాటు బడ్జెట్ సమావేశాల్లో వాటి కొరకు నిధులను పెంచాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రచార ఆందోళన కార్యక్రమాల్లో గ్రామస్థాయిలో ఉన్న వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు. కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, పల్లపు వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నన్నే సాబ్, తదితరులు పాల్గొన్నారు. పై సమస్యలపై పార్టీ కార్యకర్తలకు సమగ్ర అవగాహన కల్పించడానికి మార్చి రెండవ తేదీన హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని,ఈ సమావేశానికి పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తలందరూ హాజరవుతున్నట్లు జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు.

 

More articles

Latest article